జె.ఏ.సి నాయకుల రిలే నిరాహారదీక్షకు జనసేన సంఘీభావం!!

  • అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు జేఏసీ ఉద్యమం 5వ రోజు..

అన్నమయ్య జిల్లా, కేంద్రం రాయచోటిలో తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో జె.ఏ.సి నాయకుల చేపట్టిన 5వ రోజు రిలే నిరాహారదీక్ష కు సంఘీభావంగా శిబిరాన్ని ఉద్దేశించి జనసేన నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ…అంబేద్కర్ గారికి అవమానం జరిగితే జనసేన చూస్తూ ఊరుకోదని, పేదలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనసేన అండగా ఉంటుందని బాబసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే రాష్ట్ర వైసీపీ ప్రభుత్వానికి, పాలకులకు, అధికార యంత్రాంగానికి ఎందుకంత భయమని నిలదిస్తూ… వారిలో చిత్తశుద్ధి ఉంటే విగ్రహన్ని తొలగించిన చోటనే తిరిగి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పాలకులు తక్షణమే స్పందించి త్వరతిగతిన పునరుద్దించాలని, అదేవిధంగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వెంటనే తొలగించిన స్థానంలోనే నిలబెట్టాలని డిమాండ్ చేశారు. రాయచోటి అసంబ్లీ ఇంఛార్జ్ షేక్ హసన్ భాష మాట్లాడుతూ.. మన దేశానికి రాజ్యాంగ సృష్టికర్త విగ్రహానికే భద్రత లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము కాబట్టి అందరూ కలిసి చైతన్య వంతులై ఇటువంటి దుర్మార్గాలకు, దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని కండిచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పఠాన్, జయరామ్, కొండా, వశివుల్లా, ప్రదీప్, జనసైనికులు మరియు జె ఏ సి నాయకులు, ప్రజాసంఘాలు, అంబెడ్కర్ సేన, పలురాజకీయ పార్టీలు, వివిధ మాధ్యమాల నేతలు పాల్గొన్నారు.