*రాజకీయ పార్టీలసమీక్ష సమావేశంలో పాల్గొన్న శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి
నందిగామ పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఆర్డిఓ కార్యాలయంలో జరిగిన అన్ని రాజకీయ పార్టీల సమీక్ష సమావేశానికి హాజరైన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, నూతన ఓటర్ల నమోదు మరియు పోలింగ్ బూతుల సమస్యలపై జరిగిన చర్చలో జనసేన పార్టీ తరఫున సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటు వేయడం ఎంత ముఖ్యమో, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటును నమోదు చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి, జనసేన పార్టీ తరఫున కాలేజీల్లో మరియు గ్రామాల్లో నూతన ఓటర్ నమోదు కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఓటు నమోదు ప్రక్రియను వివరించి, వారి హక్కును వారికి తెలియజేస్తామని చెప్పారు. అదనంగా, నియోజకవర్గంలో మొత్తం 222 పోలింగ్ బూతులుండగా, కొన్ని బూతుల్లో 1500 నుండి 1600 ఓటర్లు పైగా ఉండడం వల్ల పోలింగ్ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టుతోందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఓట్లను ఓటర్లకు చేరువగా ఉన్న బూతులకు బదిలీ చేయవలసిందిగా సూచించారు. అలాగే, ప్రభుత్వం చేపట్టే సంబంధిత కార్యక్రమాలకు జనసేన పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆర్డిఓకి తెలియజేశారు. తదనంతరం, చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు కలిసి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండల ఉపాధ్యక్షులు పురంశెట్టి నాగేంద్ర, కొట్టే హరికృష్ణ, ఐలపోగు నాగేంద్ర, తోట మణికంఠ, తోట వీరబాబు సహా జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment