బయరెడ్డి కాలనీలో జనంలోకి జనసేన పట్టణ బాట

మదనపల్లి మండలం, కోళ్లబయలు గ్రామం, బయరెడ్డి కాలనీలో రాజారెడ్డి తరుపున జనంలోకి జనసేన పట్టణ బాట కార్యక్రమం బుధవారం జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో, కాలనీ వాసులతో కలసి ఇంటి ఇంటికి తిరిగి కరపత్రాలు ఇచ్చి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ సిద్దాంతలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ ప్రజల్లో అనూహ్య స్పందన కనిపిస్తుందని, జగన్మోహన్ రెడ్డి తండ్రిని చూసి, ప్రజలు ఓట్లు వేసి 151 సీట్లు ఇస్తే చేతనైతే ప్రజలకి సేవ చేయాలి, సాయం చేయాలి కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు కానీ, అభివృద్ధి మాత్రం శూన్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మద్యపానం నిషేధం, ప్రజావేదిక కూల్చేశాడు, జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ సమస్య, సిపిఎస్ రద్దు చెప్పినవి ఏవి చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఏ కేసులు లేని ఆయనని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించాడని త్వరలోనే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లరూపంలో బుద్ది చెప్తారని, జనసేన టీడీపీ పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రెడ్డి శేఖర్ రెడ్డి, నవాజ్, లవన్న, జంగాల గౌతమ్, జయ, గంగులప్ప, విజయ్ కుమార్, నరేష్, జనర్ధన్, జశ్వంత్, నారాయణ స్వామి, జవిలి మోహన్ కృష్ణ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.