వీరబల్లె మండలంలో జనంలో జనసేన కార్యక్రమం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, వీరబల్లె మండలంలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు ఆదేశాలమేరకు జనంలో జనసేన కార్యక్రమం ఆమూరి వాండ్లపల్లె, పుత్తావాండ్లపల్లె, కావలిగడ్డలలో జనసేన నాయకులు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరబల్లె మండల జనసేన నాయకులు చింతల దినేష్, సురేష్, ఆంజనేయ రెడ్డి, శివానంద, హర్షవర్ధన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.