జనంలోకి జనసేన మేనిఫెస్టో

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, చినరౌతుపేట గ్రామంలో కరిమజ్జి మల్లీశ్వారావు జనసేన – ప్రతి ఇంటింటికి జనసేన కార్యక్రమం.

ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేనపార్టీ సీనియర్ నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు 88వ రోజు ఇంటింటికీ జనసేనపార్టీ ప్రతి ఇంటికి కరిమజ్జి కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటికి జనసేనపార్టీ నాయకులు స్వయంగా వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలపై ఆరాతీసి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని గ్రామస్థులకు భరోసా ఇవ్వడం జరిగింది.

చినరౌతుపేట గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని, వారందరినీ ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

గ్రామములో సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకువెళతానని, దీర్ఘకాలిక సమస్యలను రాబోయేరోజుల్లో పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు రానున్న కాలంలో జనసేన పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవరకు ప్రతిఒక్క జనసేన పార్టీ జనసైనుకులు అలుపెరుగని పోరాటం చేయాలని ఇరుగ్రామాల జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా మల్లీశ్వారావు మరియు లక్ష్మునాయుడు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు రమణ, నాగేశ్వరరావు, శివాజీ, నానాజీ తనూజ్, బాలకృష్ణ తదితరులు భారీగా పాల్గొన్నారు.