జనంలోకి జనసేన

ఎస్.కోట, జనంలోకి జనసేనలో భాగంగా మంగళవారం జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు రేగపుణ్యగిరి సందర్శించారు. ఈ సందర్భంగా రేగపుణ్యగిరి గిరిజనులతో మాట్లాడి గ్రామమంతా కలియతిరిగి వారి జీవన విధానము ప్రత్యక్షంగా పరిసిలించారు. వారి ప్రధాన జీవనాధారంగా పొడు వ్యవసాయము, మేకల పెంపకము వృత్తిగా జీవిస్తున్నప్పటి, ఐటీడీఏ, జీసీసీ నుండి ఏటువంటి ప్రభుత్వ సహకారము లేదని, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు దరలేక తగిన ఆదాయము లేక కుటుంబ పోషణ భారంగా ఉందని గిరిజనులు జనసేన నాయకుల ముందు తమగోడు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 5 రకాల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని జనసేన ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు ఆధ్వర్యములో అదికారులకు, కూటమి నాయకులకు, పవన్ కళ్యాణ్ కు వినతులు సమర్పించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గ్రామసభ నిర్వహించి రేగపుణ్యగిరి గిరిజనులకు 4కోట్లతో తారు రోడ్డు, హౌసింగ్ స్కీములు, పొడుపట్టలు, అంగన్వాడీ సెంటర్ ఏర్పాటుకి అధికారులకు ఆదేశించారు. కూటమి నాయకులు, అధికారులు జనవరి 16 న రోడ్డు శంకుస్థాపన చేసినప్పటికీ కాంట్రాక్టర్ పనులు చేపట్టలేదని జిల్లా పంచాయతీరాజ్ ఏ.ఈ ఈ రత్నకుమార్ కి జనసేన నేతతో కలిసి గిరిజనులు పిర్యాదు చేయడంతో కాంట్రాక్టర్ ఒక జెసిబితో పనులు మొదలు పెట్టి, పుణ్యగిరి శివాలయం వరకే అరకిలోమీటర్ రోడ్డుకి గ్రౌండ్, జంగిల్ క్లియరెన్స్ పనులు జరగడంతో మిగిలిన 3కిలోమీటర్లు రోడ్డు మార్చినాటికి పూర్తి కాదని, వైద్యం కోసం డోలి కష్టాలు తప్పవని వారు జనసేన నేత వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు గిరిజనులతో మాట్లాడుతూ రేగపుణ్యగిరి సమస్యలు పరిష్కారము అయ్యేవరకు అధికారులపై ఒత్తిడి తెచ్చి, గిరిజనులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోడ్డు పనులు వేగవంతం చేయమని, కాంట్రాక్టర్లకు ఆదేశించమని ఇంజనీరింగ్ అధికారులకు సన్యాసి నాయుడు విజ్ఞప్తి చేయగా పనులు వేగవంతం చేయమని కాంట్రాక్టర్ కి అదేశాలిస్తామని హామీ ఇచ్చారు.

Share this content:

Post Comment