రాజంపేట గ్రామంలో “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర”

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రాజంపేట గ్రామంలో “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర” జనసేన శ్రేణులు, జనసైనికుల కోలాహలం నడుమ ముందుకు సాగింది. ఈ పాదయాత్రలో జనసేన నాయకురాలు శ్రీమతి వెంకటలక్ష్మికి అడుగడుగున హారతులు పడుతూ పూల వర్షాలతో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతీ ఇంటింటికి గడపగడపకు తిరుగుతూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీ-చైన్ ఇచ్చి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు పై ఓటు వేసి జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి స్థానికులతో మమేకమై కాసేపు వారితో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాజంపేట గ్రామంలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, వాడుక నీరు బయటికి వెళ్ళడానికి సరైన మార్గం లేక మురుగు నీరు రోడ్లపైకి చేరడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అలాగే వీది లైట్లు లేకపోవడం వలన చీకట్లో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలపై దృష్టి సారించి త్వరిత గతిన సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసారు. ఈ పాదయాత్రలో వీరి వెంట జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు.