మహాపాదయాత్రకు చీపురుపల్లి గ్రామంలో జననీరాజనం

  • వైయస్సార్సీపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేది గోరంత.. లాక్కునేది కొండంత… బత్తుల
  • నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం..
  • ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెలో సగర్వంగా జనసేన జెండా ఎగరవేస్తాం
  • నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీపై త్వరలో పోరాటానికి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పూర్తిస్థాయిలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం
  • జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర 69వ రోజు

జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర లో భాగంగా.. సీతానగరం మండలం, చీపురుపల్లి గ్రామంలో.. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి అపూర్వ స్వాగతం లభించింది.. మహిళలు హారతులు పడుతూ, బాణసంచా కాల్చుతూ.. జనసైనికుల కేరింతల మధ్య పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగింది.. గ్రామంలో ప్రజలతో మమేకమవుతూ, ప్రతి ఒక్కరినీ ఈసారి జనసేన పార్టీకి ఓటు వేసి, పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి, ఆశీర్వదించాలని బత్తుల వెంకటలక్ష్మి అభ్యర్థించడం జరిగింది.. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటామని, నియోజకవర్గాన్ని యదేచ్చగా దోచుకుంటున్న వైసీపీ నాయకుల తీరును ఎండగట్టడానికి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీదే విజయమని, మూడు రోజుల్లో ప్రారంభమయ్యే క్రియాశీలక సభ్యత్వాలు నమోదుకు జనసైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.. నాయకులు, జనసైనికుల సహకారంతో పాదయాత్ర ముందుకు కొనసాగింది.. ఈ కార్యక్రమంలో కోన వాసు, కె ఆనంద్, సిహెచ్ అభి, జి నవీన్, కే. ప్రసాద్, బి, ఉదయ్, కె రాజకుమార్, ఎస్ తనుష్, జి.అశోక్, టి రవితేజ, ఏ ప్రసాద్, వై అనిల్ కుమార్, జి సుబ్రహ్మణ్యం, కె మున్న, సీహెచ్ అబ్బు, డి నాగరాజు, బి యేసు, బి నరేష్, యు దిలీప్, డి రాకేశ్, బి రాంచరణ్, సిహెచ్, ప్రశాంత్, జి. వెంకన్న, మరియు మండల సీనియర్ నేతలు నాగరపు సత్తిబాబు, మద్దాల యేసుపాదం, బండి సత్య ప్రసాద్, పి వరప్రసాద్, గెడ్డం కృష్ణయ్య చౌదరి, రుద్రం నాగు, తన్నీరు సురేష్, తన్నీరు రాజేంద్ర, తన్నీరు సీతారాం, తన్నీరు సైపోసి, తన్నీరు అచ్యుత్, తన్నీరు చైతన్య, సైతిన్ వినయ్, బోబ్బిరెడ్డి సూరిబాబు, దాసరి రమేష్, ఎర్ర మణికంఠ, రాపాక మణి, బి డీపీ నాయుడు, మిర్తిపాడు ప్రసాద్, ఎస్ కె రబ్బానీ, ఇతర జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.