నిడమనూరులో నామినేషన్ వేసిన జానారెడ్డి

నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు. నామినేషన్ వేసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఓటరుకు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేలా టీఆర్‌ఎస్, బీజేపీలకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. భారత దేశంలోనే ప్రయోగాత్మకంగా నామినేషన్స్ వేసి ప్రచారాలకు పోకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ ముందుకు వస్తే తమ పార్టీని ఒప్పిస్తానని సవాల్ విసిరారు. అధికార దుర్వినియోగం చేయకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేయకుండా పోటీ చేయాలని జానారెడ్డి పేర్కొన్నారు.