జోగిని ఓడించే బాధ్యత జనసైనికులదే: ఎస్ వి బాబు

  • ఆందోళనలో పెడన వైసిపి నాయకులు (జోగి వర్గం)
  • ఈసారి స్థానిక నాయకులకే టికెట్ అంటున్న వైసీపీ అధిష్టానం
  • అవినీతి జోగికి టిక్కెట్టు ఇవ్వాలని స్థానిక నాయకులు అల్టిమేట్
  • పట్టించుకోని వైసిపి అధిష్టానం
  • జోగి రమేష్ అంత పనిమంతుడే అయితే టిక్కెట్ కు ఆందోళన అవసరమా?

పెడన నియోజకవర్గం: జోగి రమేష్ నోటి దూలకు ఓటమి భయం రుచి చూసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత పెడన నియోజకవర్గం జనసైనికులు తీసుకున్నారని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ పెడన నియోజవర్గానికి ఎమ్మెల్యే అయినాక నియోజకవర్గాన్ని సర్వ నాశనం చేసి అన్ని వనరులను ఇష్టానుసారంగా దోచుకున్నాడు. ఇబ్రహీంపట్నం నుండి పెడన నియోజకవర్గం కి వలస వచ్చిన ఈ వలస పక్షి దోపిడీలో కూడా తన సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులను ఇతర ప్రాంతాల నుండి పెడనకు దిగుమతి చేసి అవినీతికి లైసెన్స్ ఇచ్చి నాలుగు మండలాల్లో ఇష్టానుసారంగా మట్టిని దోచుకున్నాడు. ఇలాంటి మట్టి దొంగకి మరో ఐదు సంవత్సరాలు అవినీతి లైసెన్స్ రెన్యూవల్ చేయండి అని వైసిపి నాయకులు సమావేశాలు పట్టి మరి వైసిపి అధిష్టానాన్ని వేడుకోవడం సిగ్గుచేటు
దోపిడీకి, అక్రమ సంపాదనకి బయటి వారికి అవకాశం ఇచ్చిన జోగి రమేష్. తనకు భజన చేసే అవకాశం మాత్రం స్థానిక నాయకులకు ఇచ్చాడు. స్థానికంగా ఉన్న కొందరి నాయకులకు అరకొర పదవులు ఇచ్చి తనకి టిక్కెట్ ఇవ్వాలని లేకపోతే రాజీనామా చేస్తామని సరికొత్త డ్రామా ఆడిస్తున్నాడు జోగి రమేష్. జోగి రమేష్ ఎమ్మెల్యే, తదనంతరం మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి వరగబెట్టింది ఏమీ లేదు. పెడన నియోజకవర్గంలో ఇంతకుముందు ఎన్నడి లేని విధంగా డ్రగ్ కల్చర్, పేకాట క్లబ్బులను ప్రోత్సహిస్తూ అనేక కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నం అయ్యేటట్లు చేసింది జోగి రమేష్ నాయకత్వంలోనే. జోగి రమేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాయి విక్రయాన్ని అభివృద్ధి చేశాడు పేకాట క్లబ్బులను ప్రోత్సహించాడు. ఈ అవినీతి చక్రవర్తి పరిపాలనలో అభివృద్ధి జాడే లేదు. నియోజకవర్గంలో అనేక గ్రామాలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. తీరప్రాంత గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించాడు. కొద్దిపాటి వర్షానికి పంట పొలాలు నీట ములుగుతున్నాయి కారణం జోగి రమేష్ అక్రమ మట్టి తవ్వకం మీద పెట్టిన శ్రద్ధ పంట కాలువల తవ్వకం మీద గాని డ్రైనేజీల మీద గాని దృష్టి పెట్టకపోవడమే. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఆధారపడి జీవిస్తున్న చేనేత రంగాన్ని కూడా జోగి రమేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత దీనస్థితికి చేరుకుంది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని పరిస్థితికి తీసుకొచ్చాడు. మత్స్యకారుల వైపు చూసిన దాఖలాలే లేవు. మడ అడవులను ఆక్రమణలో ముందున్నాడు. జోగి రమేష్ పాలనలో దళితుల ఊసే లేదు. దళితులను వేధించిన సందర్భాలు అనేకం. తన సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించి తనకు భజన చేసే నలుగురు కాపు నాయకులతోనే రాజకీయం చేస్తాడు జోగి. పోనీ ఆ కాపు నాయకులు కైనా ఏమన్నా న్యాయం చేశాడా అంటే అదీ లేదు. ముడుపులు ఇస్తేనే పదవి. లేకుంటే కాపు కరేపాకే. ఒక కాపు నాయకుడు దగ్గర 25 లక్షల తీసుకొని మార్కెట్ యార్డ్ పదవి ఇచ్చాడు అనేది బహిరంగ రహస్యం. శనివారం మీటింగ్ పెట్టిన స్థానిక వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్థానికంగా మనకి ఎవరికీ నాయకత్వ లక్షణాలు లేవా? పక్క నియోజకవర్గంలో నుంచి జోగి రమేష్ వచ్చి మనల్ని పరిపాలించాలా? అంతిమంగా మేం కూడా ఈసారి వైసీపీ టికెట్ జోగి రమేష్ కి రావాలని కోరుకుంటాం కారణం జోగి రమేష్ ని చిత్తుచిత్తుగా ఓడించి తన స్వస్థలమైన ఇబ్రహీంపట్నం పంపే అవకాశం వస్తే వదులుకో. జోగి రమేష్ నోటి దూలకు ఓటమి భయం రుచి చూసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత పెడన నియోజకవర్గం జనసైనికులు తీసుకున్నారు. ఈసారి జోగికి టిక్కెట్ వచ్చే అవకాశాలు తక్కువ ఒకవేళ అవకాశం వస్తే ఓడించే బాధ్యత మాది అని స్ వి బాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *