జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన శ్రేణులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామ పంచాయతీ బ్రిడ్జ్ సమీపంలో గల పాల్వంచ దమ్మపేట ప్రధాన రహదారి అయినా రోడ్డుకు గుంతలు కారణంగా నిత్యం రద్దీ గా వుండే ఈ రహదారి పై ఎంతమంది ప్రయాణికులు ప్రమాదానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కార మార్గాన్ని చూపలేక పోయారు. మంగళవారం నాడు ఇద్దరు వ్యక్తులు మాదారం నుండి ములకలపల్లికి ద్విచక్ర వాహనంపై పయనిస్తూ ఉండగా ప్రమాదకరమైన గుంతలో పడి ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం గమనించిన ములకలపల్లి మండలం జనసేన నాయకులు స్పందించి ఎక్కడ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ జనసైనికులు ప్రత్యక్షమై అక్కడ సమస్య పరిష్కార మార్గం చూపాలని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలను గుర్తు చేసుకొని వెంటనే రహదారికి తమ సొంత డబ్బులుతో మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం కార్యదర్శి గరికె రాంబాబు, జనసేన విద్యార్థి విభాగం సభ్యులు కోడిమె వంశీ, గొల్ల వీరభద్రమ్ మరియు జనసేన ములకలపల్లి మండలం నాయకులు ప్రవీణ్, వినీత్, రాజు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.