జనసైనికుడు శ్రీకాంత్ కు ప్రమాద బీమా చెక్కు అందజేత

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శనివారం జూబ్లీహిల్స్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాధారం రాజలింగం సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు గాయపడిన చాకలి శ్రీకాంత్ కి జనసేన పార్టీ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ద్వారా 32 వేల చెక్కు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ సాకేత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.