జనసైనికుడు శ్రీరామ్ కు ప్రమాద బీమా చెక్కు అందజేత

గోపాలపురం: దేవరపల్లి మండలం, కృష్ణంపాలెం గ్రామములో జనసేన పార్టీ సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్ గృహములో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత సంవత్సరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడైన కడిమి శ్రీరామ్ ప్రమాదమునకు గురై గాయాలు అయిన సందర్భంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు కల్పించిన ప్రమాద బీమా నిమిత్తము 34,000/- రూ చెక్కును ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధానకార్యదర్శి కరాటం సాయి, నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు సమక్షంలో శ్రీరామ్ తండ్రి కడిమి దుర్గాప్రసాద్కు అందజేసినారు. ముఖ్య అతిధి కరాటం సాయి మాట్లాడుతూ జనసేన పార్టీ గత మూడు సంవత్సరాలుగా పార్టీ క్రియాశీలక సభ్యులకు ఏ విధమైన ప్రమాదము జరిగినా ఆ కుటుంబాలను ఆర్థికంగా, నైతికంగా ఆదుకోవాలని గొప్ప ఆశయంతో ఆ స్కీమును అమలు చేస్తున్నారు. మొదటి సంవత్సరంలో సుమారు 90 వేలు మంది క్రియాశీలక సభ్యులుగా నమోదయ్యారు. 2వ సంవత్సరం సుమారు 3,60,000 మంది సభ్యులు నమోదు అవాలి 3వ సంవత్సరంలో 6,19,000 మంది క్రియాశీలక సభ్యులుగా గత మార్చి నాటికి పార్టీలో చేరారు. పార్టీ తనవంతు సహాయంగా ఇన్సూరెన్స్ బాపతు ఒక వ్యక్తి 500/-రూ కట్టి క్రియాశీలక సభ్యులుగా జాయిన్ అయితే పార్టీ 1500/-రూ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తుంది. ఈ విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సంవత్సరమునకు 2 కోట్లు చెప్పున ఈ మూడు సంవత్సరములు 6 కోట్ల రూపాయలు క్రియాశీలక సభ్యుల నిమిత్తం ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించారు. కాబట్టి జనసేన పార్టీ ఆపదలో ఉన్నవారికి ఏదో విధంగా మేలు చేయాలనే దృష్టితో ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఎంతో చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా పార్టీ క్రియాశీలక సభ్యులకు మేలుచేయలేదు. ఆ ఘనత ఒక్క జనసేనపార్టీకి దక్కుతుంది అని తెలియజేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగానే కాకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలకు మన రాష్ట్రంలోనే కాకుండా యావత్తు భారత దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవంచినప్పుడు కొన్ని లక్షల రూపాయలు సహాయంగా అందజేసిన దాఖాలలు వున్నాయి. వీటన్నటికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన 60కి పైగా బోట్ల దగ్ధము జరిగి నష్టపోయిన యజమానులకు వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరపునుండి ఒక్కొక్క కుటుంబానికి 50,000/-రూ ఆర్థిక సహాయము చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈరోజే ప్రకటించడం మనం అందరం ఈరోజు చూసాము. ఈ విధంగా ఒక రాజకీయ పార్టీ ఎంతోమందిని ఆర్థికంగా ఆదుకున్న దాఖలాలు జనసేన పార్టీ వల్లే సాధ్యమని మరియు రాబోయే రోజుల్లో జనసేన పార్టీని రాష్ట్ర ప్రజలు దీవించి ఆశీర్వాదిస్తారని అందరము నమ్ముతున్నాము. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు, జిల్లా కార్యదర్శి అత్యుత సత్యనారాయణ, జిల్లా ప్రధానకార్యదర్శి యంట్రపాటి రాజు, దేవరపల్లి మండల ప్రెసిడెంట్ కాట్నం గణేష్, నల్లజర్ల మండల ప్రెసిడెంట్ సోడసాని బాపిరాజు, ద్వారకాతిరుమల మండల ప్రెసిడెంట్ దాకారపు నరసింహమూర్తి, గోపాలపురం మండలం ప్రెసిడెంట్ పోల్నాటి రాజేంద్ర, పార్టీ సీనియర్ నాయకులు కాళ్ళ వెంకటరత్నం, శివ నాగప్రసాద్, అనిశెట్టి గంగరాజు, సురేష్, రుద్ర శ్రీను, నాయుడు అబ్బాయిరాజు, నేలప్రోలు సూర్యచంద్ర, పప్పు గోపి, పెనుగొండ శివ, నేలప్రోలు బాబి వీరమహిళలు సీతా రత్నకుమారి, సెంథిల్ కుమారి, శోభారాణి వివిధ గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్స్ కంబాల సత్తిబాబు, కషీవిస్వానాధం, కాట్నం సురేష్, జె.కె, వరుణ్, హరిబాబు, శివకృష్ణ, తేజ, బాలు, సుందర్ సింగ్, తాతబ్బయి, మణికంఠ, కృష్ణ, నాగరాజు, మొదలగు పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన కరాటం సాయికి జనసేన గ్రామ సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్ మరియు వారి సతీమణి శ్రీమతి దుర్గ శాలువాతో సత్కరించారు.