జనసేన సిద్ధాంతాలతో జనసైనికుడి పెళ్లి పత్రిక

*వరుడు సాయి కృష్ణ జనసేన పార్టీ సిద్ధాంతాలను ముద్రించిన పెళ్లి ఆహ్వాన పత్రిక.. *మరియు ఆహ్వాన పత్రికను అందుకున్న జనసేన పార్టీ నాయకులు, అధికారులు..

జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని తన పెళ్లి కార్డు పై ముద్రించి పవన్ కళ్యాణ్ పై ప్రేమను చాటుకున్న యువకుడు ముదిగండ్ల సాయి కృష్ణ.. ఈ సందర్భంగా.. కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు తిరువూరు నియోజకవర్గం జనసేన నాయకులు మనుబోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏ కొండూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన జనసైనికుడు ముదిగండ్ల సాయి కృష్ణ ఈ నెల మే 4వ తేదీన తన స్వగ్రామం రామచంద్రపురంలో జరగనున్న వివాహ మహోత్సవ వేడుకసందర్భంగా జనసేన పార్టీకి ఉపయోగపడే విధంగా జనసైనికుల అందరికీ ఆదర్శంగా ఉండేవిధంగా తన పెళ్లి కార్డు తయారు చేయాలనే తలంపుతో వరుడు ముదిగండ్ల సాయి తనను సంప్రదించగా పెళ్లి కార్డుపై జనసేన పార్టీ సిద్ధాంతాలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని ముద్రించి బంధుమిత్రులకు, నాయకులకు అధికారులకు అందజేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడం జరిగిందని, వెంటనే మారుమాట్లాడకుండా రెట్టించిన ఉత్సాహంతో పెండ్లి కుమారుడు సాయి జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని పెళ్లికార్డుపై ముద్రించడం జరిగిందని ఆయన తెలిపారు.. అలా ముద్రించిన శుభలేఖలను వరుడు సాయి తనతోటి జనసేన నాయకులతో కలిసి స్వయంగా వందల కిలోమీటర్ల దూరాన్ని లెక్కచేయక హైదరాబాద్ వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరియు మెగా కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు తెలిపారు.. గతవారం రోజుల నుండి జనసేన పార్టీ ముఖ్య నాయకులందరినీ కలిసి వరుడు సాయికృష్ణ తనే స్వయంగా శుభలేఖలు అందించి వారినిపెళ్లికి ఆహ్వానించడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. సాయి కృష్ణ చేసిన ఈ మంచి పనికి జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, పోతిన మహేష్, బండ్రెడ్డి రామకృష్ణ, గోవిందు అంజిబాబు, అక్కల గాంధీ, బొలియశెట్టి శ్రీకాంత్, రావి సౌజన్య, చింతల లక్ష్మి కుమారి, తదితర జనసేన నాయకులకు అలాగే ఏ. కొండూరు మండలం తాసిల్దార్, ఏ కొండూరు ఎస్సై తదితర ముఖ్య అధికారులకు పెండ్లి ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగిందని వారందరూ కూడా వరుడు సాయి కృష్ణ చేసిన మంచి పనిని అభినందించినట్లు మనుబోలు శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల మే నాలుగో తేదీ సాయంత్రం ఏడు గంటలకు ఏ కొండూరు మండలం రామచంద్రపురంలో జరిగే జనసైనికుడు సాయి వివాహ వేడుకలలో జనసేన నాయకులు అందరు కూడా పాల్గొని వధూవరులను దీవించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.