రాష్ర జనసేన పార్టీ మీడియా హెడ్ ని కలిసిన జగ్గంపేట జనసైనికులు

జగ్గంపేట: రాష్ర జనసేన పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ జగ్గంపేట నియోజకవర్గ జనసైనికులని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంకి పిలిచి నియోజకవర్గ పరిస్థితులపై ఆరాతీసి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో అధినాయకుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా పార్టీ వారిపై తగు చర్యలు తీసుకుంటుంది అని మీరు పార్టీ నిర్ణయం పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు పని చేసుకుంటూ వెళ్ళాలని, తెలిపి పార్టీ మీకు అండగా ఉంటుందని హమీఇచ్చారు. ఈ సమావేశంశంలో జగ్గంపేట నియోజకవర్గ నాయకులు జిల్లాకార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జిల్లాసంయుక్త కార్యదర్శి బాలు, నియోజకవర్గ ఐటి కో ఆర్డినేటర్ అరినే రాజేష్, నియోజకవర్గ నాయకులు పాలిశెట్టి సతీష్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల సూత్ అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఐటి కో ఆర్డినేటర్ సూరపురెడ్డి నరేష్, కిర్లంపూడి మండల చిరంజీవి యువత అధ్యక్షులు ఎలుబండి శివ, గోకవరం మండల ఉపాధ్యక్షులు గవిని దుర్గా ప్రసాద్, జగ్గంపేట మండల చిరంజీవి యువత అధ్యక్షులు మధ్దూరి ప్రసాద్ మరియు నియోజక వర్గ నాలుగు మండలాల ఉపాధ్యక్షుడు, మండల కమిటీ సభ్యులు, జగ్గంపేట టౌను అధ్యక్షులు గవర సుధాకర్, గ్రామాధ్యక్షులు జనసైనికులు పాల్గొన్నారు.