చిలకలూరిపేట, పోరాటపటిమతో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యాన్ని, ప్రజలని గౌరవిస్తూ తన సర్వస్వాన్ని ప్రజల కోసం ధారబోసిన మహోన్నత వ్యక్తి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి చెప్పారు. గురువారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి శ్రీనివాసరావు(స్వాములు) ఆధ్వర్యంలో చీరాల జనసేన పార్టీ నూతన కార్యాలయ భవన శంఖుస్థాపన వేటపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిష్టమే జనసేన లక్ష్యమని ఇందులో భాగంగానే భారతదేశంలోనే ఏ నేత, ఏ పార్టీ కూడా సాధించని 100శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన ముందంజలో ఉందని వెల్లడించారు.
- జైలుకు బెయిల్‌కు మధ్య ఊగిసలాడే జగన్
సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు, దిగజారిపోతున్న ప్రజాస్వామ్య విలువలు చూసి విసుగెత్తి మండే గుండెల పోరాట స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని యువతలో, సమాజంలో మార్పే సంకల్పంగా జనసేన పార్టీ ప్రస్థానం మొదలైందని బాలాజి గుర్తు చేశారు. ప్రజా క్షేత్రంలో ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని, సేవా కార్యక్రమాల్లో జనసేన ముందంజలో ఉంటుందని తెలిపారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం దక్కించుకుని రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నదని వెల్లడించారు. గత ఎన్నికల్లో ప్రజల తిరస్కారంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించని పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్ తన అహంకారపూరితమైన మాటలతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. జైలుకి బెయిల్ కి మధ్య ఊగిసలాడే వ్యక్తి, జగన్ అని విమర్శించారు. పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12 వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని, జనసేనపార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చెయ్యాలని బాలాజి కోరారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట, బాపట్ల, రెపల్లే, పొన్నూరు జనసేన పార్టీ ఇన్‌చార్జులు తోట రాజారమేష్, శ్రీమన్నారాయణ, ఇక్కుర్తి శ్రీనివాసురావు, బాబు, పార్టీ ఆవిర్బావసభ బాపట్ల పార్లమెంట్ కమిటీ ఇన్‌చార్జి వడ్డాన మార్కెండేయులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment