జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

దర్శి జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు జనసేన వాలంటరీకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను వాలంటీర్లకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్న జనసేన పార్టీ నాయకులు, వాలంటరీలకు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా బృందం తెలియపరిచింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, పుప్పాల రుద్ర, టౌన్ ప్రెసిడెంట్ చాతరేసి కొండయ్య, మండల అధ్యక్షులు మాధ వెంకట శేషయ్య, కుటల ప్రసాద, దర్శి మండల నాయకులు పుప్పాల పాపారావు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment