పుట్టపర్తిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పుట్టపర్తి: పుట్టపర్తి మండలంలో శుక్రవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో.. పుట్టపర్తి మండల అధ్యక్షులు పత్తి చంద్రశేఖర ఆధ్వర్యంలో.. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా క్రియాశీలక సభ్యులకు కిట్లను అందజేసి.. క్రియాశీలక వాలంటీర్స్ కు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ మరియు రాష్ట్ర ప్రధాకార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.