ఉప్పంగల ఎస్సీ కాలనీలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

ముమ్మిడివరం: తాళ్ళరేవు మండలం, ఉప్పంగల ఎస్సీ కాలనీలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు అనుసారం జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పీఏసీ సభ్యులు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. పార్టీ యొక్క విధివిధానాలు తెలుపుతూ, సభ్యత్వ నమోదుతో జరుగు లబ్దిని వివరించారు. బడుగు బలహీన వర్గాలకు ఏ పార్టీ చేయని విధంగా సేవ చేయాలనే చిత్తశుద్దితో పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు చేపట్టారు. అందరూ క్రియాశీల మెంబర్షిప్ తీసుకోవాలి అని బాలక్రృష్ణ పిలుపునిచ్చారు. అనంతం వివిధ పార్టీల కు సంబంధించిన ఎస్సీ యువత గుత్తాల బాలక్రృష్ణ, ముడికి క్రాంతి కుమార్, వంగా త్రిమూర్తులు, పైడికొండల రమేష్ ఆధ్వర్యంలో పితాని బాలకృష్ణ సమక్షంలో పార్టీలో చేరారు. యువత కోరిక మేరకు వారికి వాలీబాల్ ఈవ్వడం జరిగింది. జాయిన్ అయిన వారిలో ముర్రే దుర్గా ప్రసాద్, వినకోటి శ్రీనివాస్, ముర్రే రాంబాబు, గుత్తల వినోద్ కుమార్, పులపకూర దిలీప్, దడాల చిన్న బాబు, మడికి వెంకటేశ్వర్లు, దడాల రాము, కోపకొండ భైరవ మూర్తి, దడాల ఆనంద్ వీరితో పాటు సుమారు 50 మంది సభ్యులు జనసేన పార్టీలో చేరారు ఇదే కాలనీకి చెందిన ముడికి అమీర్ కుమార్ ఇటీవలే కిడ్ని మార్పిడి చేసుకుని ఇంటిదగ్గర ఉంటూ జీవిస్తున్న సమాచారం తో జనసేన పార్టీ తరుపున దాతలు సహకారం తో పాటూ పితాని బాలకృష్ణ కలిపి యాభై వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులు కు అందించారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల మహిళా కన్వీనర్లు కడలి ఈశ్వరమ్మ, ముత్యాల జయలక్ష్మి మండల జనసేన పార్టీ అధ్యక్షులు అత్తిలి.బాబురావు, వి.ఆర్.యన్.బి.ప్రసాద్, కన్నిడి నాని, మణికంఠ, వీరభద్రరావు మరియు ఈ కార్యక్రమంలో జన సైనికులు తో పాటు గ్రామ ప్రజలూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.