మరోసారి పవన్ కళ్యాణ్ పై అభిమానం చాటుకున్న జనసేన కార్యకర్త

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణంలో నివసిస్తున్న మేడబోయిన కార్తీక్ పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల, వ్యక్తిత్వం మరియు సేవాగుణం పట్ల ఆకర్షుతులైన కార్తీక్, పవన్ కళ్యాణ్ అభిమానిగా వుంటూ జనసేన పార్టీ స్థాపితం నుండి పార్టీ కార్యకర్తగా పార్టీకీ సేవలందిస్తూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాన్ని, జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తూ, ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ, సమస్య పరిష్కారానికి పోరాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి యొక్క జనసేన పార్టీ కార్యకర్తకు అందుబాటులో వుంటూ జనసేన పార్టీ తెలంగాణా రాష్ట్ర నాయకత్వం అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ అధికారికంగా పదవి ఇచ్చిన ఒక కార్యకర్తవలై ముందు ఉంటూ నడుస్తున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్ కు ది 8-12-2021 నాడు ఉదయం 8గం 21ని.లకు స్పందనతో వివాహం నిశ్చయించబడినది. తన వివాహ ఆహ్వాన పత్రికను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోని ముద్రించి. పవన్ కళ్యాణ్ పట్ల, జనసేన పార్టీ పట్ల మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు.