పోలవరం నియోజకవర్గంలో జనంలో జనసేన

పోలవరం చిర్రి బాలరాజు పర్యటన వివరాలు, ఉదయం 9 గంటలకి రెడ్డి నాగం పాలెం వెళ్లే రోడ్డులో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రెడ్డి నాగం పాలెం రోడ్డు చాల అధ్వానంగా ఉందని చూసి సంబందిత అధికారులతో మాట్లాడారు. జిల్లెలగూడెం పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో పర్యటించారు. చిర్రి బాలరాజు చిరకాల మిత్రుడు జిఎస్ రెడ్డి ని కలిసి కాసేపు మాట్లాడడం జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న గిన్నెపల్లి సమరసింహారెడ్డి ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేయడం జరిగింది. కోయనాగం పాలెం మానుగోపాల గ్రామాల్లో పర్యటించి అక్కడ సమస్యలు ఏంటో తెలుసుకున్నారు. పెడరాల గ్రామంలో అక్కడ ప్రజలతో ముఖ ముఖి కార్యక్రమం నిర్వయించారు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. పాత కుంకాలలో తుఫాన్ వల్ల శేఖర్ ఇల్లు కూలిపోయింది అని తెలుసుకుని వారికి కొంత మొత్తం డబ్బు ఇచ్చి, వారి కుటుంబానికి అండగా ఉంటాం అని తెలియ చేసారు. ముత్యాల రావు పేట గ్రామాన్ని సందర్శించారు. నాయకులు కోటం లక్ష్మణరావు ఇంటికి వెళ్లి కాసేపు మాట్లాడడం జరిగింది. జిల్లెల గూడెం పరిధిలో నీ గ్రామాల వారికి బస్సు సౌకార్యం లేదని, తాగునీరు, డ్రైనేజీ సమస్య, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం వెంటనే అందజేయాలని పంచాయతీ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు గుణపర్తి సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, పట్టిసీమ గ్రామ అధ్యక్షుడు కరిబండి రాజు, నాయకులు కోటం లక్ష్మణరావు, సిద్దన రామ కృష్ణ, తోట మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాము, కురసం రమేష్, ప్రధాన కార్యదర్శులు చీకట్ల సాయి కృష్ణ మూర్తి, మామిడిపల్లి ప్రసాద్, కాకి అయ్యప్ప, తుర్రం రమేష్ పాల్గొన్నారు.