లంచం ఇవ్వలేదని ఉపాధి కోసం నిర్మించిన దుకాణం కూల్చివేత

  • కార్పోరేటర్ జయకర్ తీరుపై జనసేన, టీడీపీ నాయకుల ఆగ్రహం
  • 4వ డివిజన్ నుండి జనసేన పార్టీ కార్పోరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన గిడుతూరి పద్మ కూరగాయల దుకాణం కూల్చివేత
  • షాపు అనుమతికి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన వైసీపీ కార్పోరేటర్ జైకర్
  • రెడ్డి అప్పల నాయుడు సమక్షంలో మీడియాను ఆశ్రయించిన బాధితురాలు

ఏలూరు నియోజవర్గం: ఏలూరు నియోజవర్గంలోని 4వ డివిజన్ నుండి జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన గిడుతూరి పద్మ దుకాణాన్ని నేలమట్టం చేయించిన వైసిపి 5వ డివిజన్ కార్పొరేటర్ జైకర్.. ఇటీవలె గిడుతూరి పద్మ గారి భర్త మరణించిన తరుణంలో ఉపాధి కొరకు చిన్న కూరగాయల వ్యాపారం కొరకు దుకాణాన్ని ఏర్పాటు చేస్తుంటే దౌర్జన్యంగా 5వ డివిజన్ కార్పొరేటర్ జైకర్ తన అనుచరులతో వచ్చి ఆ నిర్మాణాన్ని ఆపివేసి కఠిన నిర్మాణాన్ని సైతం కూల్చి వేశారు‌. ఈ దురాగతాన్ని ఖండిస్తూ ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దాసరి ఆంజనేయులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు..ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ వెంకటాపురం గ్రామ పంచాయతీ చెంచుల కాలనీలో విలీనం అయిన గ్రామం ఇది.. గిడుతూరి పద్మ ఈ డివిజన్ నుండి జనసేన పార్టీ తరపున కార్పోరేటర్ అభ్యర్థిగా పోటీ చేశారు. తన భర్త చనిపోవడంతో ఏదో జీవనోపాధి కోసం చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిద్దామని చూస్తే స్థానిక కార్పొరేటర్ జైకర్ దౌర్జన్యంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పడేయని పక్షంలో మంత్రి గార్కి చెబుతానని బెదిరించి నేలమట్టం చేయడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ లంచాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఎవరైనా ఇళ్లు కట్టుకుందామని అనుకుంటే లక్ష, 2 లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి చూస్తున్నాం. తన భార్యను పంచాయతీ సర్పంచిగా నిలబెట్టినప్పుడు కొంత ఖర్చు చేశారు. ఆ ఆకలితోనే ఆ ఖర్చును ఎలాగోలా పిండేద్దామని ఎక్కడా ఖాళీ సైట్ దొరికితే మింగేద్దామని కామన్ సైట్ దొరికితే అమ్మెద్దామని ఎవరైనా ఇళ్లు కట్టుకుంటే వాళ్ళ దగ్గర లక్ష 2 లక్షల రూపాయలు డిమాండ్ చేద్దామని అత్యాశతో ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేదవాళ్ళ మీద మీరు మీ ప్రతాపం చూపిస్తారా..?? లేదంటే ఆళ్ళనాని ఏదైనా మీకు ప్రత్యేక జీవో జారీ చేశారా..?? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఇలాంటి కార్పోరేటర్ను నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇతను మొత్తం కార్పోరేషన్ వ్యవస్థ కే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.‌ ఇది దరిద్రమైన పని. ఈ కార్పోరేటర్ ఉంటున్న ఇళ్లు కూడా బిఫామ్ లోనే ఉందని దాదాపు 3,4 సెంట్లు బిఫామ్ లోనే ఉందని కొలతలు కొలిచి ఆ ఇంటిని పడేయాలని దానిని కూడా జనసేన పార్టీ తరపున సర్వే చేస్తామని మీడియా సమక్షంలో అన్నారు. ప్రభుత్వం ఎలాగో ఉపాధి కల్పించలేక పోతుంది. స్వయం ఉపాధి కోసం ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటే వాటికోసం లక్షల రూపాయల లంచాలు అడుగుతున్నారని మండి పడ్డారు.. వ్యాపారాలు పెట్టనీయకుండా ఇదేంటి అని ప్రశ్నించారు.. ఇక్కడ దుకాణం నిర్మాణం చేస్తే బాధితురాలిని కార్పొరేటర్ లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ తీసుకొస్తే అనుమతి ఇస్తానని చెప్పారు.. ఇదేమిటని ఆమె అడగ్గా ఆమెపై దుర్భాషలాడి తన సహచరులతో ఆమెపై దౌర్జన్యం చేస్తున్న ఇలాంటి అవినీతి పరుల్ని పెంచవద్దని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.. మీరు ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి ప్రజలతో కన్నీరు పెట్టిస్తూ వాళ్ళేదో చిన్నాచితకా వ్యాపారం చేసుకొని జీవనోపాధిని సాగిద్దామనుకుంటే వాళ్ళ పొట్టలు కొట్టే ఇటువంటి దరిద్రులు, దుర్మార్గులు, పనికిమాలిన వాళ్ళని ఎన్నుకోవడం ప్రజల యొక్క దురదృష్టకరం అని ఈరోజు అర్థం అవుతుంది.. ఈ దుకాణాన్ని స్వయంగా నేనే నిర్మిస్తానని ఎవడాపుకుంటారో ఆపుకోండి చూద్దాం అని హెచ్చరించారు. దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ కార్పోరేటర్లకు వాళ్ళ విధులేంటో తెలుసా. వాళ్ళు ఏదో ఐఏఎస్, ఐపీఎస్ చదివినట్టు 60 సంవత్సరాలు వాళ్ళ ఉద్యోగానికి ఢోకా లేదనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజా సమస్యల్ని సామాజిక పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మాత్రమే మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఖబడ్దార్ కార్పోరేటర్ జైకర్. మీరు ఇటువంటి అకృత్యాలకు పాల్పడి మొత్తం కార్పోరేషన్ వ్యవస్థకే తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మీకు చేతనైతే దమ్ము ధైర్యం పౌరుషం ఉంటే ఈ ఏరియాలో చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి కాలువ లాగా ప్రవహిస్తున్నాయి. దీని మీద మీ దృష్టి పెట్టండి.. ఒక సామాన్యుడు ఇళ్లు కట్టుకుంటే కార్పోరేటర్ ఏం చేయాలో మీ పనితీరు ఏంటో తెలుసుకోండి.. మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇబ్బంది పెడితే కార్పోరేటర్లు వారికి బాసటగా నిలవాలి వాళ్ళను నిట్టనిలువునా ముంచకూడదు.‌ ఎక్కడైనా బిల్డింగ్ కడుతున్నారని తెలిస్తే లక్షల లక్షలు దొబ్బేయడం సిబ్బందులను ముందుగా పంపి ఆ తరువాత మీరు వసూలు చేసుకుంటున్న పరిస్థితి చాలా దౌర్భాగ్యం.. జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత తో సామాజికంగా ప్రజల్ని ఎవరు ఎక్కడ పీడించిన సరే మేము ఐక్యంగా పోరాడి ఆ సమస్యకు తగిన పరిష్కారం చూపించి తీరుతామని ఇకనైనా మీ పరిధిలో ఉండాలని మీడియా ముఖంగా హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశి నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నాయకులు బొండా రాము నాయుడు, తుమరాడ రమణ, శివ తదితరులు పాల్గొన్నారు.