అగ్ని ప్రమాద బాధితులకు జనసేన అండ

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలం, కనిమెట్ట గ్రామ పంచాయతీలో సోమవారం(06/02/2023) రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం లో ఇల్లు కోల్పోయిన గడదేశి అప్పన్న, రాము మరియు అప్పలరాజు కుటుంబాలను బుధవారం ఉదయం పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించి విపత్కర పరిస్థితుల్లో జనసేన అండగా ఉంటుందని ఆ పంచాయతీ జనసైనికులు దుక్క అప్పలరాజు, సిమ్మన్న, నర్సింగ్, సూరిబాబు ఆద్వర్యంలో మండల జనసేన కార్యవర్గం తెలిపింది. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర మాట్లాడుతూ విపత్తులు నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అగ్ని ప్రమాదాలు తరుచూ సంభవిస్తున్నా సదరు భాదితుల ఇళ్లు పూర్తిగా ఆహుతి అయినంత వరకూ అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకోవడంలేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేయడానికి సన్నాహాలు చేయాలని జనసేన పార్టీ తరపున బాధితుల సమక్షంలో డిమాండ్ చేశారు. బూర్లె విజయశంకర్ మాట్లాడుతూ బాధితులకు వెంటనే ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, స్మార్ట్ రమేష్, పిసిని నాగరాజు, మాదేటి ఈశ్వర్రావు, కిలారి రమేష్, దుక్క అప్పలరాజు, లంకలపల్లి వెంకటేష్, బాడిత మహేష్, పసుపులేటి మహేష్, దువ్వు గణేష్, సిమ్మన్న, అల్లాడ రాము, జగదీష్, భలభద్రుని జానకీరామ్, చందు పసుపులేటి, భరత్, వెంకటేష్, జానకి, పవన్, సోని, బొట్ట హరీష్, బోట్ట నవీన్, తదితరులు పాల్గొన్నారు.