ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ కు జనసేన అండ

మంగళగిరి, శనివారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ (ఏ.పి.ఎఫ్.ఏ) రాష్ట్ర కమిటీ సభ్యులు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసి నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం అంటూ ఇచ్చిన జీవో (65) గురించి వారు చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు చిల్లపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడుతూ ఈనెల సెప్టెంబర్ 22న విడుదల చేసిన జీవో (65)లో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీ అంటూ ఉండకూడదని పేర్కొన్నారు. ఇలా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 10 లక్షల మంది ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారని, వారికి ఈ వృత్తి తప్ప వేరే వృత్తి తెలియదని, వారి జీవనాధారం ఈ వృత్తి మీదే ఆధారపడి ఉంటుందని, ఈ సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను వివరించాలని కోరారు. చిల్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దాదాపు 10 లక్షల మంది, వారి కుటుంబాలు ఈ వృత్తి మీదే ఆధారపడి ఉన్నారని, ఇలా అద్దాంతరంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తే ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నవారి జీవనాధారం మీద దెబ్బతీసినట్టే అవుతుందని అన్నారు. ఈ సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి జనసేన పార్టీ తరపు నుంచి తగిన న్యాయం జరిగే విధంగా చూస్తామని జనసేన పార్టీ తరఫున వారికి భరోసా కల్పించారు.