పెచ్చేటి సత్యనారాయణ కుటుంబానికి జనసేన అండ

ఆచంట మండలం, వేమవరం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కంసాల వారి చెరువు గట్టు దగ్గర నివాసం ఉంటున్న పెచ్చేటి సత్యనారాయణ తాటకిల్లు శనివారం తెల్లవారుజామున ఎలక్ట్రికల్ షార్ట్ సెక్యూరిటీ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. సామాన్లు ఏవి తీసుకోలేని విధంగా మొత్తం కాలిపోయాయి. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, ఆచంట నియోజకవర్గ ఇన్చార్జ్ చేగొండి ప్రకాష్ బియ్యం, కూరగాయలు, వంట సామాన్లు, బట్టలు, దుప్పట్లు జనసేన తరఫున సత్యనారాయణ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం పేచ్చేటి సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇల్లు స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, జిల్లా కార్యదర్శి, చిట్టూరి శ్రీనివాస్, ఆచంట టౌన్ ప్రెసిడెంట్ నంబూరు విజయ్, మండల నాయకులు సలాది పెద్దిరాజు, కోడేరు గ్రామ అధ్యక్షులు కుంపట్ల రమేష్, వల్లూరు గ్రామ అధ్యక్షులు కమిడి ఉమామహేశ్వర్, పెనుమంచిలి నాయకులు నార్జన లక్ష్మణరావు, చామన అంజిబాబు, వేమవరం నాయకులు గుత్తుల శేఖర్, దొంగ సత్యనారాయణ, మద్దినీడి నాగరాజు, గుత్తుల రవి, కుడుపూడి సాయిరాం, ఆచంట నాయకులు
కడలి శ్రీను, నిమ్మను వీర్ శేఖర్, పీతాని లక్ష్మణ్, దూది నరసింహ, గుండా బత్తుల తులసి ప్రసాద్, మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.