పాఠశాల రక్షణ కోసం జనసేన విజ్ఞప్తి

*ఎమ్మెల్యే జయకృష్ణ సానుకూల స్పందన

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, పాలకొండ మండలం పరిధిలోని బెజ్జి గ్రామ యూపీ పాఠశాలలో గత వైస్సార్సీపీ పాలనలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను తలవరం గ్రామానికి తరలించారు. అప్పటి నుండి 1వ, 2వ తరగతుల విద్యార్థులకే పాఠశాల పరిమితమైంది. తాజాగా, ప్రభుత్వం ఈ పాఠశాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, గ్రామ విద్యాభివృద్ధి కోసం పోరాటం చేస్తూ పాలకొండ మండల జనసేన నాయకులు మిడతన ప్రసాద్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణని కలిసి విజ్ఞప్తి చేశారు. కనీసం 1వ, 2వ తరగతులైనా గ్రామంలో కొనసాగించాలని, లేకపోతే గ్రామం అంతా నిరక్షరాస్యంగా మారిపోతుందని భావితరాల భవిష్యత్తు దృష్టిలో విన్నవించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే జయకృష్ణ సానుకూలంగా స్పందించడం గ్రామ ప్రజలకు ఆశాజనకంగా మారింది.

Share this content:

Post Comment