*పాఠ్యపుస్తకాలు అందజేసిన పులిపాటి అనిల్
ఆత్మకూరు, ఆర్థికంగా వెనుకబడి, తండ్రిని కోల్పోయి విద్యాభ్యాసంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన ఓ విద్యార్థికి జనసేన ఓ అండగా నిలిచింది. “తల్లికి వందనం” పథకం ద్వారా శ్రీనివాస పాఠశాలలో చేరిన ఆ బాలుడికి అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ లేని కారణంగా విద్య కొనసాగించలేని స్థితిలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పట్టణ నాయకుడు గడ్డం వంశీ కృష్ణ వెంటనే ఆత్మకూరు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ పులిపాటి అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, అనిల్ కుమార్ స్పందించి స్వయంగా అన్ని పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ కొనించి విద్యార్థికి అందించారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ – “విద్యార్ధుల భవిష్యత్తు కోసం జనసేన ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మా పార్టీ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి” అని పేర్కొన్నారు.
Share this content:
Post Comment