కోరగాము గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం
ఆమదాలవలస నియోజవర్గంలో, కోరగాము గ్రామంలో జనసైనికులతో, క్రియాశీలక సభ్యత్వం గురించి మరియు జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, జనసేన పార్టీ బలోపేతానికి, మనం ఏ విధంగా కృషి చేయాలి లాంటి చాలా విషయాల మీద, సుమారు రెండు గంటలు పాటు చర్చించడం జరిగింది. ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొని, చాలా మంచి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు కొరగాము జనసేన పార్టీ టీం జనసైనికులు అందరికీ కూడా పేరుపేరునా, హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మల్లేశ్వరరావు కోరుకొండ, ఎంపీటీసీ విక్రమ్, నారాయణరావు, శేఖర్ మరియు కోరగం జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-27-at-9.05.40-PM-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-27-at-9.05.45-PM-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-27-at-9.05.42-PM-1024x470.jpeg)