ప్రజల కష్టాలను తీర్చేవాడే నిజమైన ప్రజానాయకుడు జనసేనాని బండారు శ్రీనివాస్

రాష్ట్ర జనసేన పార్టీ, అతి ముఖ్యమైన ప్రముఖ నాయకులు నాదెండ్ల మనోహర్ శ్రమదాన కార్యక్రమం పర్యటనలో భాగంగా తాపేశ్వరం నుంచి ద్వారపూడి వరకు వెళ్లే ప్రధాన రహదారికి మరమ్మతులకు మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో భారీ వ్యయంతో నాయకులు, జనసైనికులు, కార్యకర్తలతో అట్టహాసంగా శ్రమదానం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమం చూసి ప్రభుత్వం వెంటనే కళ్లు తెరవాలని, తక్షణం ప్రధాన రహదారికి మరమ్మతులను, నాణ్యమైన మెటీరియల్ తో బాగు చేయించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గంలోని, తాపేశ్వరం నుంచి ద్వారపూడి వెళ్లే ప్రధాన రహదారికి భారీ వ్యయంతో మండపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రముఖ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ చేతులమీదుగా వేగుళ్ల లీలాకృష్ణ ఈ శ్రమదానం కార్యక్రమం జరిపించారు. మండపేట-తాపేశ్వరం- ద్వారపూడి ప్రధాన రహదారి మార్గం గుండా పలువాహనాలపై, బస్సులపై, కార్లపై ప్రయాణించాలంటే ప్రయాణికులు చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఈ మధ్య కాలంలో చాలా మంది రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర గాయాలకు పాలయ్యారని, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వేగుళ్ళ లీలాకృష్ణ ప్రయాణికుల బాధలను చూసి చలించి, రహదారి వెంబడి ప్రయాణించే ప్రయాణికుల కష్టాలు కొంతైనా తీర్చాలని, ఈ శ్రమదానం కార్యక్రమం ద్వారా ఈరోజు సహాయ సహకారాలు అందించారు. కొంతలో కొంత మెరుగైన రహదారి నిర్మాణపు పనులను దగ్గరుండి వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన నాదెండ్ల మనోహర్ తో, పలు నియోజకవర్గ జనసేన ఇన్చార్జిలు సహాయ సహకారాలతో జయప్రదంగా రోడ్డు శ్రమదానం పనులు కొనసాగించారని, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం జిల్లాల్లోని నియోజకవర్గపు ఇన్చార్జి తో రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గ ఇన్చార్జిలకు, ముఖ్య నాయకులు పలు సూచనలు చేసినారని, అదేవిధంగా ఈరోజు స్వర్గస్తులైన మాజీ ఎమ్మెల్యే వల్లూరు నారాయణరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రతి ఒక్కరు లక్ష్యం వైపు ప్రయాణించాలని, ఈరోజు మనం పడే కష్టం, రేపటి గెలుపుకు నాంది కావాలని నాదెండ్ల మనోహర్ జనసేన నియోజకవర్గ ఇన్చార్జిలకు, జనసైనికులకు, కార్యకర్తలకు, తెలియజేశారు.