గాంధీనగర్ ప్రాంతంలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో శనివారం 38వ డివిజన్ లోని గాంధీనగర్ ప్రాంతంలో ముమ్మిడి కోటేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు ఈ ప్రాంతంలో తిరుగుతూ స్థానిక దళితులతో మాటా మంతి కలిపారు. తదుపరి వారితో మాట్లాడుతూ సరి అయిన ఆదాయంలేక ఇబ్బందులు పడుతుంటే పేదల నడుము విరిగేలా కరెంటు చార్జీలు అంటూ, సిలిండర్ ధర పెంచేస్తూ, చెత్త పన్ను అంటూ పేదల రక్తమాంసాలను ఈ వై.సి.పి ప్రభుత్వం పిండేస్తోందనీ కుటుంబాన్నే పోషించుకుంటారా లేక ఇలాంటి చార్జీలని భరిస్తారా అని ఈ ముఖ్యమంత్రికి కనీస ఆలోచన లేకపోవడం చూస్తుంటే పేదలన్నా దళితులన్నా లెక్కలేనితనమని అర్ధమవుతోదన్నారు. అసలే సరైన ఆదాయంలేక బలవర్ధకమైన ఆహారం లేకపోవడం వలన పేదలు ముఖ్యంగా దళితులు అనారోగ్యకరమైన పరిస్థితులని ఎదుర్కుంటున్నారన్న విషయం అందరికీ విదితమే అనీ మరి నిర్లక్ష్యమైన పాలనచేస్తున్న ఈ వై.సి.పి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. తదుపరి స్థానిక అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో సబ్బే దీప్తి, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శి కంట రవిశంకర్, బండి సుజాత, ముత్యాల దుర్గ శివకుమారి, యేలేటి సోనీ ఫ్లోరెన్స్, బోడపాటి మరియ, బట్టు లీల, చోడిపల్లి సత్యవతి, రమణమ్మ, ఉమ, మోర్తా మాలతి తదితరులు పాల్గొన్నారు.