కడలి గ్రామంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

  • వేడుకలలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
  • రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పితాని బాలకృష్ణ

రాజోలు నియోజకవర్గం: రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండల జనసేన పార్టీ పరివేక్షణలో కడలి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు బుధవారం మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యూత్, నాయకులు, జనసైనికులు, అభిమానులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించినారు. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, శేఖర్, రాజేశ్వరరావు బొంతు, మండల ఎంపీపీలు, మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వీర మహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.