కళ్యాణదుర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో శనివారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకాలలో భాగంగా కోటవీధిలో ఆంజనేయ స్వామి దేవాలయం నందు పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అనంతరం భవన నిర్మాణ కార్మికులతో కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ వారితో పాటు భోజనం చేయడం జరిగింది. భావన నిర్మాణ కార్మికులు ఈ ఇసుక పాలసీలు వల్ల అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలియజేశారు.. కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూడాలని ఎదురుచూస్తూ ఉన్నారు. కుందుర్పి మండలం బండమీద పల్లి గ్రామంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.లక్ష్మణ్ పల్లి గ్రామంలో కేక్ కట్ చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలహారం జనసేన పార్టీ తరఫున వేయటం జరిగింది. తూముకుంట గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజల మధ్య పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. పార్టీ ఆదేశాలు ప్రకారం గవర్నమెంట్ హాస్టల్ నందు విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రమేష్, జనసేన పార్టీ ఐటి టీం కోఆర్డినేటర్ రాఘవేంద్ర, వీర మహిళలు షేక్ తార, త్రివేణి, జనసేన నాయకులు వంశీ, జయకృష్ణ, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ప్రభు, శ్రీహర్ష, ముక్కన్నా ఉదయ్, జాకీర్, శ్రావణ్, సంతోష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.