కొయ్యలగూడెంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

పోలవరం నియోజకవర్గం, సెప్టెంబర్ 2 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి శుక్రవారం కొయ్యలగూడెం టౌన్ లో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.

  • అనారోగ్య మహిళకు ఆర్ధిక సాయం

కొయ్యలగూడెం మండలం పరింపూడి గ్రామపంచాయతీలో గల పందిళ్ళ మణి అను మహిళ అనారోగ్యం కారణంగా బాధపడుతూ ఉండగా పందిళ్ళ మణి కి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

  • ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం

కొయ్యలగూడెం మండలంలో గల గవర్నమెంట్ హాస్పిటల్ లో
జనసేన ధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పేషెంట్లకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది.

  • స్కూలు పిల్లలకు పుస్తకాల పంపిణీ

కొయ్యలగూడెం మండలంలో జనసేన ధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్థానిక ఎంపీపీ యూపీ స్కూల్లో పిల్లలకు స్కూల్ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది.

  • బాలుర హైస్కూల్లో భోజనం ప్లేట్లు పంపిణీ

కొయ్యలగూడెం టౌన్ లో జనసేన ధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా బాలుర హైస్కూల్లో భోజనం ప్లేట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. స్కూల్ యాజమాన్యం మరియు స్కూల్ పిల్లలకు భోజనం ప్లేట్లు పంపిణీ జరిగింది.

  • పుస్తకాల పంపిణీ

జనసేన ధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా పోలవరం రోడ్డులో గల ఎలిమెంటరీ స్కూల్ నందు పోలవరం జనసేన ఇన్చార్జి బాలరాజు మండల ప్రెసిడెంట్ తోట రవి మరియు జనసైనికుల సమక్షంలో పుస్తకాలు స్కూలు యాజమాన్యంకు అందించడం జరిగింది

  • జనసేన జెండా ఆవిష్కరణ

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పరంపూడి రామాలయం వద్ద జనసేన స్తూపం ఆవిష్కరించడం జరిగింది ఆవిష్కరణ కార్యక్రమం పోలవరం ఇంచార్జ్ చిర్రి బాలరాజు చేతుల మీదుగా కార్యక్రమం జరగడం జరిగింది. పరింపూడిలో ఉన్న సభ్యులు జనసేన పార్టీలోకి చిర్రి బాలరాజు జనసేన కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఆ స్థూపం వద్ద కేక్ కటింగ్ తోట రవి, చిర్రి బాలరాజు సమక్షంలో కేక్ కటింగ్ జరిగింది. తీన్మార్ డప్పులతో ఎంతో ఉల్లాసంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది.

  • కేక్ కటింగ్ కార్యక్రమం

కొయ్యలగూడెం పట్టణంలో పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జన సైనికులు మరియు జనసేన వీర మహిళలు సమక్షంలో కేక్ కటింగ్ చేసి జనసేన అధినేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చోడిపిండి సుబ్రహ్మణ్యం, మేకల తేజ, సంకు మధు, మేడిన కన్నయ్య, కూచిమించి శ్రీనివాసు, కొట్టు ఏడుకొండలు పడిందల నాని ఆరేటి బాబి రాము సాయి దీపు పరింపూడి వాస్తవ్యులు పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.