లింగపాలెం మండలంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

చింతలపూడి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా లింగపాలెం జనసేన నాయకులు శనివారం లింగపాలెం మండలంలోని ములగలంపాడు, బోగోలు, కలరాయన గూడెం, ధర్మాజీగూడెం, మఠంగూడం, లింగపాలెం, సింగగూడం, తిమ్మక్కపాలెం, రంగాపురం, ఆశన్నగూడెం, బాదరాల గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, డీజే ఆటపాటలతో కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు, గౌరవ అధ్యక్షుడు మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు పటాన్ యాకూవలి, తాళం మల్లేశ్వరరావు, నిమ్మగడ్డ రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శులు పూజారి సురేష్, మునికొండ వంశీ గోపి, మోదుగు అంజి బాబు, కార్యదర్శులు పఠాన్ సుభాని, పమిడికొండ కిషోర్, పొదిల మహేష్, కటకంశెట్టి రాటాలు, పుంజాల నరేంద్ర మరియు మండల కమిటీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.