మర్రిపాడు మండలంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

మర్రిపాడు మండల కేంద్రలో మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి అధ్యక్షతన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ సిమెంట్ బెంచీలను ఏర్పాటు మండల అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి జనసైనిడిని కలుపుకుని మండలంలోని పలు గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎడమకంటి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్ మండల ఉపాధ్యక్షులు ఇరుపోతు ఉదయ్, కడప రవి, బిల్లిపాటి మధు, తమతం పెనుమాది, పోతల ప్రవీణ్, నరసింహ రాయల్, కుంభగిరి రవి, చంద్ర, పాపరాయుడు, నారాయణ, సుధీర్, కర్నాటి కృష్ణయ్య, శంకర్ కిట్టు, శ్యామ్ చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు.