సర్వేపల్లిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

సర్వేపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు మరియు నెల్లూరు జిల్లా జనసేన సీనియర్ నాయకులు పి.టోనీ బాబు మూడు రోజులు పాటు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మొదటి రోజున అనాధాశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు వాటర్ బాటిల్స్ అందజేశారు. రెండవ రోజు శనివారం దాదాపు 500 వందలమందికి ఆత్మకూరు బస్టాండ్ నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టోనీ బాబు మాట్లాడుతూ.. నా లాంటి వాళ్ళను సేవా మర్గంవైపుకు మళ్లించిన మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 500 వందల మందికి అన్నదానం చేయడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు. రాబోవు రోజుల్లో బలంగా చేపడతామన్నారు. మా అధినేతను వచ్చే జన్మదినం నాటికి ముఖ్యమంత్రిగా చూసుకుంటాం అన్నారు. ఆదిశగా జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తాం అని అన్నారు. మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా 3వ తేదిన పవర్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.