పామిడి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

గుంతకల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని పామిడి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పామిడి మండల అధ్యక్షులు ధనుంజయ అధ్యక్షతన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక పూజా కార్యక్రమం చేయించి తదుపరి ర్యాలీగా జికొట్టాలకు బయలుదేరి అక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు కేక్ కటింగ్ చేసి మరల వంక రాజు కాలువ గ్రామానికి వెళ్లి అక్కడ స్కూలు విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు ఎరేజర్లు మెండర్లు తదితర మెటీరియల్ ని విద్యార్థులకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సుధాకర్, లక్ష్మన్న, సాయి కుమార్, వేణుగోపాల్, రోషన్ జమీర్, ఖాజావలి, శేక్షావలి, సూర్య,అబ్దుల్, శరత్ కుమార్, మాబు, లాలు స్వామి, రాజు, భాస్కర్ గౌడ్, శబరీష్ మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.