మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

పిఠాపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా శుక్రవారం తేదీన జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన శుభసందర్భంగా పిఠాపురం టౌన్ ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, జనసేన నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, మాజీ కౌన్సిలర్లు వేణు నారాయణ రావు, కర్రి కాశీ విశ్వనాథ్,నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.