విద్యుత్ కోతలకు నిరసనగా జనసేన, బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ..

ఎన్.టి.ఆర్. జిల్లా నందిగామ నియోజకవర్గంలో విద్యుత్ కోతలకు నిరసనగా జనసేన బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాత బస్టాండు జనసేన కార్యాలయం నుండి బి.జె.పి కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరిన జనసైనికులు విద్యుత్ కోతలను అరికట్టాలని, సామాన్య మధ్య తరగతి ప్రజలను కాపాడాలని నినాదాలు ఇస్తూ.. ర్యాలీగా బయల్దేరి.. గాంధీ సెంటర్ లో విసనకర్రలతో నిరసన తెలిపి.. జనసైనికులు విద్యుత్ శాఖ అధికారులును కలిసి అదేవిధంగా జనసేన కార్యకర్తలు ప్రజలకు విసనకర్రలు ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేనన నియోజకవర్గ నాయకులు పూజారి రాజేష్ మాట్లాడుతూ.. నందిగామ నియోజకవర్గంలో కరెంటు కోతల వల్ల ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. చేతి వృత్తులపై జీవించేవాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. 12 గంటల నుంచి 15 గంటల వరకు కరెంటు తీస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లల్లో వారి పరిస్థితి చూడటానికే దారుణంగా ఉంది. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని 24 గంటలు ప్రజలకు కరెంటు అందుబాటులో ఉండేలా ఈ ప్రభుత్వం చూడాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేశారు. అనంతరం నందిగామ ఆర్డీవోను కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, నందిగామ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు కుడుపుగంటి రామారావు, టౌన్ పార్టీ అధ్యక్షులు తాటి శివ కృష్ణ, చందర్లపాడు మండల పార్టీ అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, జిల్లా పార్టీ ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ తోట ఓంకార్, వీర మహిళలు శ్రీమతి తోటకూర పద్మావతి, శ్రీమతి పాములపాటి వెంకట తులసి, శ్రీమతి చనమల సౌందర్య, శ్రీమతి గోపిసెట్టి నాగలక్ష్మి, సురేష్, వీరాంజనేయులు, షేక్ పెద్ద బాజీ, రామిరెడ్డి గోపి, వంశీ, నరేంద్ర, కుమ్మరి రాజేష్, సాయి కనపర్తి, గోపి కొరివి, కోటేశ్వరరావు తెప్పలీ, కుర్రా నానీ, కరి హనుమంతరావు, వెంకటేష్, బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షులు తోర్లికోండ సీతా రామయ్య, చందర్లపాడు మండల పార్టీ అధ్యక్షులు గుత్తా బాలకృష్ణ, కిసాన్ మోర్చ జిల్లా కోశాధికారి చిరుమామిళ్ల శ్రీనివాసరావు, బేటి బచావో కన్వీనర్ శ్రీమతి దామా కృష్ణ వేణి, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు వా శ్రీనివాసరాజు, చింతోటి రవి కుమార్, పలువురు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.