జనసేన-బిజెపి-తెలుగుదేశం ఆత్మీయ సమావేశం

విజయవాడ తూర్పు నియోజకవర్గం శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ, భారతీ నగర్, విజయలక్ష్మి కాలనీ జనసేన-బిజెపి-తెలుగుదేశం పార్టీల నాయకుల మరియు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని), జనసేన-టిడిపి-బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావుతో కలిసి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బొప్పన భావ కుమార్, జాస్తి సాంబశివరావు జనసేన-బిజెపి-తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.