PHC లో సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-1.00.10-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-1.00.11-PM-768x1024.jpeg)
విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామం, GVMC పరిధిలో, 88 వార్డ్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో గత 4 నెలల నుండి సరైన సదుపాయాలు, స్టాఫ్ లేకపోవడం వలన వైద్యం నిమిత్తం వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక జనసేన పార్టీ నాయకులు శ్రీ వబ్బిన జనార్థన శ్రీకాంత్ వార్డు సచివాలయం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. అధికారులతో మాట్లాడుతూ… 4 నెలల క్రితం ఈ-వైద్య అనే ప్రైవేట్ సంస్థ ఆధీనంలో అందుబాటులో ఉన్నప్పుడు కొంత వరకూ ప్రజలకు వైద్యం అందేదని, ఇప్పుడు ఈ PHC లను ప్రభుత్వాధీనంలో తీసుకున్నప్పటి నుండి కనీసం వ్యాధి నిర్ధారణ రక్త నమూనా పరీక్షలు చేసుకోవడానికి వీలుకల్పించకుండా, కేవలం ఒకే ఒక డాక్టర్ తో నరవ PHC ని నడుపుతున్నారని, క్లీనింగ్ చేయడానికి కూడా అక్కడ స్టాప్ లేరని, డాక్టర్ గారు అన్ని చూసుకుంటున్నారని, పూర్వం రోజుకి 90 మంది పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ అందుకునే వారు ఇప్పుడు సదుపాయాలు లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన నరవ PHCలో సదుపాయాలు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది.