వృధాగా పారబోస్తున్న కాంక్రీట్ రోడ్ గుంతలు పూడ్చిన జనసేన

తుమ్మలపాలెం ఎన్.హెచ్.65 రోడ్డు మార్గం పక్కన కాంక్రీట్ లారీ సాంకేతిక లోపం వలన ఆగిపోవడంతో వృధాగా పారబోస్తున్న కాంక్రీట్ ను తుమ్మలపాలెం ఎంపీటీసీ పోలిశెట్టి తేజ లారీ యాజమాన్యంతో మాట్లాడి గుంతలుగా ఉన్న తుమ్మలపాలెం చిన్న కెనాల్ వంతెన్ వద్ద కాంక్రీట్ను పోసి చదును చెయ్యటం జరిగింది. గ్రామస్తులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమంలో స్వచ్ఛందంగా తనతోపాటు పాల్గొన్న తుమ్మలపాలెం జనసైనికులను పోలిశెట్టి తేజ అభినందించి కృతజ్ఞతలు తెలియజేసారు.