కొవ్వూరులో జనసేన ప్రచారం

కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు కొవ్వూరు మండలంలోని కాపవరం గ్రామం మరియు ధర్మవరం గ్రామం మరియు స్థావరం మరియు పెనకలమెట్ట మరియు దొమ్మేరు గ్రామాలలో పర్యటించి జనసేన పార్టీ సింబల్ అయినటువంటి జనసేన గ్లాసులు, పవన్ కళ్యాణ్ మనోగతం పుస్తకాలు, పాంప్లెట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మండల ప్రధాన కార్యదర్శి పెరుగు శివ, ధర్మవరం గ్రామ అధ్యక్షులు కడిమి శ్రీనుబాబు, మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి జక్కల శీను తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,