చంద్రగిరి నియోజకవర్గ, అర్బన్ మండలంలోని, సప్తగిరి పంచాయితీలో జనసేన పార్టీ కార్యాలయాని ఆ పార్టీ నియోజక ఇన్చార్జి దేవర మనోహర ప్రారంభించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆర్టీవో కూడలి నుండి బైక్ ర్యాలీగా జనసేన నాయకులు బయలుదేరి కార్యాలయం ఆవరణకు చేరుకుని అనంతరం సప్తగిరి పంచాయితీ, వేంకటేశ్వర కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసిన తరువాత కార్యాలయాన్ని దేవర మనోహర పార్రంభించారు. చంద్రగిరిలోని ప్రతి పంచాయతీలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషమని, పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కుల, మతాలకు అతీతంగా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవర మనోహర కోరారు. రానున్న స్థానిక సంస్థల నాటికి చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడి అన్ని ఎన్నికల్లో పోటీకి నాయకులు సిద్ధం కావాలని ఆయన కోరారు. కూటమిలో ఉన్నందున తెలుగుదేశం పార్టీ, బిజేపిలను కలుపుకుని సమన్వయంతో ముందుకు పోవాలని అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారం సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఇలా పంచాయతీ పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకోవడం శుభపరిణామమని, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో జనశ్రేణులు కృషి చేయాలని ఆయన కోరారు. ఎన్డీఏ ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటు కావడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్ననిర్ణయమే కారణమని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసమే ప్రతి పంచాయతీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తునట్లు ఈ పరిణామంలో రూరల్ మండలంలోని సప్తగిరి పంచాయితీ కార్యాలయాన్ని పంచాయితీ అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి దేపా మహీంద్రా సారథ్యంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని జనసేన చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జీ దేవర మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, మండల అధ్యక్షులు యువ కిషోర్, పగడాల యువరాజ్, గురునాథ్ తలారి, సంజీవి హరి, దూది జస్వంత్, స్థానిక పంచాయతీ అధ్యక్షులు సుధాకర్, బాబు యాదవ్, దేపా మహేంద్ర, వీర మహిళలు ఆశా, విజయనిర్మల మరియు తదితర ముఖ్యనాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment