వల్లూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

ఆచంట నియోజకవర్గం వల్లూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వల్లూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమగోదావరిజిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 8 వ తారీఖున కర్నూలు జిల్లాల్లో పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న 130 కౌలు రైతు కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారని. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లోకి వస్తు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని కల్ల బొల్లి హామీలతో ప్రజలను మోసంచేస్తున్నారని పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల్లోకి వస్తూ రాష్ట్రంలో ఎవరైతే అప్పుల భాదలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబాలకు మనోదైర్యం నింపి వారి పిల్లల భవిష్యత్తు కోసం తక్షణ సాయంగా ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారని రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న 3000 కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని హామీఇచ్చారని. అందుకోసం పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారని. అందుకు పవన్ కళ్యాణ్ కి రైతుల సమక్షంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు తోట తాతాజీ, కడిమి శ్రీనివాస్, యేడిద తేజా విగ్నేష్, పంపన శ్రీనివాసరావు, మాదాసు సత్యనారాయణ, తోట ఫణిద్ర, కడిమి ఉమా మహేశ్వరావు, ప్రసాద్, మోహన్ బాబు, బొక్క జైన్, మొదలగువారు పాల్గొన్నారు.