ఏలూరులో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ జన్మదిన వేడుకలు

ఏలూరు నియోజకవర్గంలో పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పుట్టినరోజు వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఉదయం 9 గం.లకు జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం.

9.30 ని.ల నుండి ఆశ్రం హాస్పిటల్ వారిచే ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు.

10 గం.లకు రవితేజ ఎడ్యుకేషన్ సొసైటీ ఎయిడ్స్ పిల్లలకు సరళ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం.

10.30 ని.లకు ప్రేమాలయంలో ఏలూరు సిటీ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం.

11 గం.లకు జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా గారి ఆధ్వర్యంలో 8 వ డివిజన్ లోని ఏడు గోరీల సెంటర్ లో ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద మొక్కల పంపిణీ కార్యక్రమం.

11.30 ని.లకు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో 7 వ డివిజన్ తూర్పు వీధిలోని దాసాంజనేయ స్వామి వారి గుడి వద్ద మొక్కల పంపిణీ కార్యక్రమం.

12 గం.లకు పత్తేబాద్ లో ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 50 మంది జనసైనికులు రక్తదానం మరియు అన్నదానం.

12.30 ని.లకు విజయలక్ష్మి ధియేటర్ దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.

సా.4 గం.లకు వట్లూరు సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం.

సా.5 గం.లకు 27 వ డివిజన్ చొదిమెళ్ళలో కేక్ కటింగ్ కార్యక్రమం.

సా.5.30 ని.లకు ఫైర్ స్టేషన్ సెంటర్ లో 51 కేజీల కేక్ కటింగ్ కార్యక్రమం.

సా.6 గం.లకు 8 వ డివిజన్ కత్తేపు వీధిలో శివ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం.

సా.6.30 ని.లకు 25 వ డివిజన్ శనివారపు పేట లో ఆదిల్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం.

సా.7 గం.లకు గోపన్నపాలెం దగ్గర కొత్తపల్లి లో కేక్ కటింగ్ కార్యక్రమం.

రాత్రి 7.30 ని.లకు వేగవరంలో పుట్టినరోజు వేడుకలు.

8 గం.లకు బావిశెట్టి వారి పేటలో పుట్టినరోజు వేడుకలు.

8.30 ని.లకు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి బావిశెట్టి వారి పేటలో సుమారు 30 మంది టిడిపి వైసీపీ పార్టీల నుండి కార్యకర్తలు ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో చేరారు.

రాత్రి 9 గం.లకు గుడివాక లంక యువకులతో జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.