నందికొట్కూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

నందికొట్కూరు నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికులతో కలిసి జనసేన పార్టీ నాయకుడు నల్లమల రవికుమార్ జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ మరియు భోజనాలు నిర్వహించి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నల్లమల రవికుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కొరకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకురావాలని వారి యొక్క వృత్తి చాలా ప్రమాదకరమైనందున వారి పట్ల దయవుంచి ఒక పథకాన్ని పెట్టాలని కోరడం జరిగింది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని, జనసేన ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఇసుక ఉచితంగా లభిస్తుందని వాటి ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చక్కగా లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులు హాజరై సంతోషాన్ని వ్యక్తపరిచారు.