వైసిపి నాయకుల దౌర్జన్యాలపై జనసేన పిర్యాదు

ఏ.ఎస్. పేట మండల కేంద్రంలోని, అనుమసముద్రం గ్రామం మిట్ట వీధిలో, మురికి నీరు వీధిలో పారుతూ దుర్గంధ భరితంగా ఉన్నది. ఈ కారణంగా విపరీతంగా దోమలు చేరి ప్రజలు అంటువ్యాధుల బారిన పడుచున్నారు. ఈ సమస్యపై జనసేన పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ బాషా ఈ విషయమై ఎన్నో పర్యాయములు సర్పంచ్ కు వినతి పత్రములు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయము సోషల్ మీడియాలో అక్బర్ బాషా పోస్ట్ చేయడం జరిగింది. దీనితో కోపోద్రిక్తులై సర్పంచ్ శ్రీమతి కుదారి హజరతమ్మ, మాజీ సర్పంచ్ పులిమి రమేష్ రెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అక్బర్ బాషాకి ఫోన్ ద్వారా దుర్భాషలాడటం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ పంపిస్తాను అంటూ హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ మైనార్టీల ఓట్లను పొంది గెలుపొందిన వైసిపి ప్రభుత్వం, నాయకులు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఈ విధంగా మాట్లాడటం ఎంతో శోచనీయం అన్నారు. మేము జనసైనికులమని వైసిపి నాయకుల తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదని పేర్కొన్నారు. జనసైనికులతో కలసి ఏ.ఎస్. పేట మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ కి ఈ విషయం మీద తగిన చర్యలు తీసుకునివాల్సిందిగా అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్బర్ బాషా, డబ్బుగొట్టు నాగరాజా, అనిల్ రాయల్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.