శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంకి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ లో స్థానిక జనసేన మండల పార్టీ అధ్యక్షులు పైడి మురళీ మోహన్ కార్యకర్తలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది కోరారు. వారితో పాటు మండల పార్టీ ఉపాధ్యక్షులు తులగపు ధనుంజయ్, సంఘంశెట్టి తేజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిలు పేడాడ రమణ, బొగ్గు అప్పలరాజు, గొల్లపల్లి శ్రీధర్, సతివాడ రామకృష్ణ, మురాల మిన్నారావు, మండల నాయకులు బాణాన భార్గవ్, గదిలి రమణ, నారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment