కౌన్సిల్లో గర్జించిన జనసేన కార్పొరేటర్ మలగా రమేష్

ఒంగోలు, గురువారం జరిగిన నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో 38వ డివిజన్ సమస్యలపై జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ గర్జించారు. అధికారులు తీరును తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. డివిజన్ పరిధిలోని డ్రైన్లు, కాలువల నిర్మాణం, అక్రమ కట్టడాలు, త్రాగు నీటి సమస్య, పారిశుద్ధ్యం వంటి పలు సమస్యలు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్లో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలల నుండి మా డివిజన్లో డ్రైన్లు, అక్రమ కట్టడాల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. తాను లెవనెత్తిన సమస్యలపై వివరణ ఇవ్వాలని కౌన్సిల్లో మలగా రమేష్ పట్టుపట్టారు. దీంతో అధికారులు సరైన సమాధానం చెప్పలేక కొద్ది కొద్ది సమయం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. త్వరలోనే డివిజన్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో మలగా రమేష్ దానికి అంగీకరం తెలిపారు. మళ్లీ అధికారుల నుండి నిర్లక్ష్యపు ధోరణి ఎదురైతే తాను ఎంత దూరమైన వెళతానని, డివిజన్ సమస్యల పరిష్కారంలో తగ్గేదే లేదని మలగా రమేష్ కౌన్సిల్లో స్పష్టం చేశారు.